Learn to adjust when its tough to manage
- Bhavalavanyam
- 0
- on Sep 09, 2022
పక్కింటి సుధాకర్ వాళ్ళూ కూడా నిన్నే వెళ్ళి కావలసిన సరుకులన్నీ తెచ్చేసుకున్నారు. మీరేమో మమ్మల్ని బయటికి కదలద్దని వార్నింగిచ్చి ఇంట్లో కూర్చోమన్నారు. ఎలా గడపాలి? ఏం వండి పెట్టాలి? ఎదిగిన పిల్లలు, వయసు పైబడిన పెద్దవాళ్ళు ఇంట్లో. అంటూ విసుక్కుంటున్న చంచల కంగారుకీ అమాయకత్వానికి నవ్వుకున్నాడు ఫోన్లోంచి వీడియో కాల్ లో చూస్తూ పార్థు (ఆమె భర్త). అత్యవసర సేవా విభాగాల్లో పనిచేస్తున్న పార్ధు ఇంటికి దూరంగా ఉద్యోగం వలన వారానికొకసారి సెలవు రోజున తప్ప ఇంటికి రాలేడు. ఈసారి లాక్డౌన్ వలన అసలెప్పుడొస్తాడో కూడా తెలీదు.
అసలే అతడు ఒక్కడూ ఈ విపత్కర సమయంలో ఇంటికి దూరంగా ఎలా కాలక్షేపం చేస్తాడో అన్న ఆందోళనకి తోడు, ఈ కంప్లీట్ లాక్డౌన్ కారణంగా ఎప్పుడు సరుకులు దొరుకుతాయో లేదో, ఎలా తెచ్చుకోవాలో ఏం చేయాలో అన్న కొత్త ఆందోళన తోడైంది.
“సరే చంచలా, ఒక మాట అడుగుతాను చెప్పు అన్నాడు పార్థు. ఊ అడగండి అంది ఆమె. ఇప్పుడు ఇంట్లో ఉన్న సరుకులతో ఎంతకాలం కాలక్షేపం చేయగలవు?” అన్నాడు.
“ఎప్పటిలాగే చేస్తే ఓ పది పదిహేను రోజులు” అంది ఆమె.
“సరే, నీకు కోపం రాదంటే నేనొక మాట చెబుతాను. అన్నీ బాగున్నప్పుడు అందరికీ అన్ని సదుపాయాలూ ఉండాలనుకోవడం తప్పుకాదు. కానీ అవసరం వచ్చినప్పుడు అందరూ సహకరించాలి. సమయానికనుగుణంగా సర్దుకుని అవసరమైతే కొన్ని వదులుకుని నడవాలి. ఈ సమయంలో అందరం ఒక క్రమశిక్షణ ఆత్మస్థైర్యం కలిగిన సైనికులలాగ మనతో మనమే పోరాడాలి.
ఎప్పుడూ మూడు నాలుగు రకాల వంటలు తినే మనం కొద్ది రోజులు ఒకటో రెండో పదార్ధాలతో కడుపు నింపుకోలేమా? వయసు మళ్ళిన వారికి అనుభవం ఎక్కువ. ఎన్నో ఎదుర్కొని ఇక్కడిదాకా వచ్చారు. అర్ధం చేసుకోగలరు. నేనూ మాట్లాడతాను. ఇంక పిల్లలకి ఇది పరీక్షా సమయం. నేర్చుకుంటారు. ఆపద వస్తే ఎలా ఉంటుందో, ఎన్ని ఎదుర్కొని నిలబడాలో తెలుస్తుంది. సర్దుకుని బ్రతకడం తెలుస్తుంది.
వాళ్ళకి ఒకసారి ఆ టీవీలో రెక్కాడితే గానీ డొక్కాడనివారి పరిస్థితి చూపించు. మనం ఏం కొనుక్కోవాలో ఆలోచిస్తున్నాం. వాళ్ళు అసలేం తిని బతకాలో ఆలోచించే పరిస్థితి కూడా లేదు.
అంతటి అవసరమొస్తే ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకుంటారు. నమ్మకం ధైర్యం అవసరం.
నిజానికి 21 రోజులు గడపడం కాదు అసలైన సమస్య. ఆ జబ్బుని తరిమి కొట్టడం. అది మనం ఊహించలేనంత పెద్దది. ఆపకపోతే సమస్త మానవాళి తుడిచి పెట్టుకు పోతుంది. ఇప్పుడు కాస్త సర్దుకోలేకపోతే రేపు ఒకళ్ళని ఒకళ్ళు పీక్కుతినాల్సిన రోజులొచ్చేస్తాయి. అంతు తెలీని జబ్బులు, కొరవడిన నిత్యావసరాలు, మందులు, మూతబడిన ఆఫీసులు ఇప్పుడు కేవలం తాత్కాలికం. కానీ సరిగ్గా పాటించని రోజున అవిశాశ్వతమై జీవించడం కన్నా మరణించడం మేలనిపించే రోజులొచ్చేస్తాయి. కాస్త వివేకంతో ఆలోచించండి.
ఇంక 21 రోజుల తర్వాత ఏంటి అంటావా? అందరితోబాటే మనమూను. అంతమంది హాహాకారాల మధ్య మనమొక్కళ్ళం సుఖంగా ఉండలేము. మహా ఉన్నా అది ఒకటో రెండో రోజులు మాత్రమే. దాటితే మనకూ తప్పనిసరి.
అందుకే, అనవసరమైన కంగారు, ఆలోచనలూఆపిప్రశాంతంగానవ్వుతూమాట్లాడు. అన్నీ అవే బావుంటాయి”, అంటున్నభర్తమాటలునిజమేఅనిపించాయిచంచలకి. కాస్తకుదుటపడిజాగ్రత్తలుచెప్పికాల్పూర్తిచేసిపనిలోపడింది. తనకిష్టమైన పాటలు వింటూ…..