Noble Mother’s Innocent Daughter
“నటించాలంటే పాత్ర కావాలన్నారని, ఈ పాత్ర తీసుకెళ్తున్నాను నాన్నా” అంటున్న కూతురి అమాయకత్వం చూసి తల బాదుకుంటుంటాడు నాగభూషణం. అతడొక నగల వ్యాపారి. అడ్డగోలుగా వ్యాపారం చేస్తూ, కల్తీ నగలమ్ముతూ, నమ్మిన వారినే మోసం చేస్తూ కావలసినంత లాభం పొందాడు. కానీ భార్య కడుపు పండలేదనే దిగులు చాలా కాలం అలాగే ఉండిపోయింది. కాంతం అతని సతీమణి. సినిమాల్లో సావిత్రిలా మహా సాధ్వి. అతడెంతగా మొత్తుకున్నా వినకుండా దానాలు ధర్మాలు దండిగా చేసేది. పూజలు, ఉపవాస దీక్షలు, […]
Read More
Learn to adjust when its tough to manage
పక్కింటి సుధాకర్ వాళ్ళూ కూడా నిన్నే వెళ్ళి కావలసిన సరుకులన్నీ తెచ్చేసుకున్నారు. మీరేమో మమ్మల్ని బయటికి కదలద్దని వార్నింగిచ్చి ఇంట్లో కూర్చోమన్నారు. ఎలా గడపాలి? ఏం వండి పెట్టాలి? ఎదిగిన పిల్లలు, వయసు పైబడిన పెద్దవాళ్ళు ఇంట్లో. అంటూ విసుక్కుంటున్న చంచల కంగారుకీ అమాయకత్వానికి నవ్వుకున్నాడు ఫోన్లోంచి వీడియో కాల్ లో చూస్తూ పార్థు (ఆమె భర్త). అత్యవసర సేవా విభాగాల్లో పనిచేస్తున్న పార్ధు ఇంటికి దూరంగా ఉద్యోగం వలన వారానికొకసారి సెలవు రోజున తప్ప ఇంటికి […]
Read More
Critical Thinking
“హమ్మయ్య… లాక్డౌన్ లో రెండ్రోజులు గడిచిపోయాయి (21 రోజులు ప్రకటనలో ఒక్కరోజే అనుకోండి). ఫర్వాలేదనిపిస్తోంది నిన్నటి అప్డేట్స్ చూస్తే. కరోనా బారిన పడ్డవారి సంఖ్యను అదుపులోకి తేగలరనే అనిపిస్తొంది ఈ లాక్డౌన్ పద్ధతి వలన. జనానికి బాధ్యత ఉండాలి. ప్రమాదమని చెప్పినా, బయటికెళ్ళొద్దని వారించినా అడపా దడపా ఎవరో ఒక ఆకతాయి రోడ్డుమీద కనిపిస్తూనే ఉన్నారు. నిన్న అత్యవసరంగా సరుకులు తేవడానికని మన పక్కవీధిలో కిరాణా షాపుకెడితే అక్కడ నలుగురైదుగురు కుర్రాళ్ళు కొనడానికి వచ్చి ఉన్నారు. పాపం రూముల్లోనో […]
Read More
First Step – Toli Adugu
శరత్ చంద్ర ఈమధ్యే ట్రాన్స్ఫర్ మీద ఒక కొత్త ఊర్లో ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నాడు. ఇన్స్పెక్టర్ అంటే పోలీస్ అనుకునేరు, హెల్త్ ఇన్స్పెక్టర్ అండి. స్వతహాగా మంచి వ్యక్తి, పైగా సేవా తత్వం ఉన్నవాడు. ఎన్నో ఏళ్ళుగా అదే ఉద్యోగంలో ఉన్నమీదట, డాక్టరు కోర్సు చదవకపోయినా అనుభవం మాత్రం అంతకంటే ఎక్కువే. అందువల్ల చుట్టుపక్కల ఎటువంటి చిన్న చితక వైద్య సంబంధిత సహాయానికైనా అర్ధరాత్రి అపరాత్రి అనే భేదం లేకుండా ఉన్నపళంగా వెళ్ళి అక్కడ అన్నీ […]
Read More