• lavibuddha@gmail.com
  • +91 81603 83161

తస్మాత్ జాగ్రత్త!!

ఎధావిధిగా ఉదయాన్నే డిజిటల్ న్యూస్ పేపర్ లో కరెంట్ స్టేటస్ చూస్తున్న సూర్యకి “ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు” అంటూ ముద్దు ముద్దుగా పలుకుతున్న తన కొడుకు సహజ్ మాటలు వినిపించాయి. వాడికి రెండున్నరేళ్ళు. ఆశ్చర్యపోతూ, ఒరేయ్ పండూ, ఎంత బాగా చెప్తున్నావో. ఏదీ మరోసారి చెప్పు అంటూ దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడబోయాడు. “ఉండు నాన్నా, కరోనా వస్తుంది. మీటర్ దూరంగా ఉండి మాట్లాడు” అంటూ చురచురా బుగ్గ తుడిచేసుకుంటూ దూరంగా వెళ్ళి […]

Read More

శారదాస్ డైరీ…. !

కొన్ని జ్ఞాపకాల చిన్ముద్రలు మస్తిష్కంపై కనీసం నామమాత్రంగా కూడా కనపడవు. మరి కొన్ని శిలా ఫలకం మీద చెక్కినట్టు లోతైన ముద్రలు వేసుకుని ఉండిపోతాయి. మీరెప్పుడైనా గమనించారా? ఈరోజు సముద్రం ఒడ్డున ఇసుక తెన్నెల్లో పిల్లలు హాయిగా ఆడుకోవడం చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు నా పుట్టిన రోజు. నేను మా వారు కలిసి చాలా కాలం తర్వాత ఇంట్లోంచి బయటికి కలిసి వచ్చేము. దాదాపు నాలుగేళ్ళ తర్వాత. నా పేరు శారద, మా వారు […]

Read More

ప్రియమైన నీకు…

ఈ ఉత్తరం నీకందే సమయానికి నేను నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. నువ్వు నన్ను కలవడానికి వచ్చేముందు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని స్పష్టంగా నీకు చెప్పదల్చుకున్నాను. చదివిన తరువాత రాకపోయినా, నీమీద నాకున్న అభిప్రాయం గానీ, గౌరవం గానీ ఏ మాత్రం మారదు. నిర్ణయం ఎప్పుడూ నీదే. నేను గతేడాది మార్చి పదకొండున నా స్నేహితురాలిని కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో, దారిలో ఒకతను రోడ్డుకు ఒక ప్రక్కగా పడి ఉండడం గమనించాను. అప్పటికే కాస్త […]

Read More