
Trust your GOAL
- Bhavalavanyam
- 1
- on Mar 08, 2023
ఒక లక్ష్యాన్ని సాధించాలి అనిపించి, అదే దిశగా సాగినప్పుడు, ఆ లక్ష్యం తాలూకు ప్రతి అంశం మన జీవితంలో, జీవన విధానంలో, మాటలో, పనిలో, ఆలోచనలో, నిద్రలో, కలలో ప్రతిచోటా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంతలా లక్ష్యం కోసం జీవిస్తే, లక్ష్యం తాలూకు విజయం మనల్ని వరిస్తుంది.
ఈ ప్రయాణంలో ఎంతో మంది మనల్ని వెనక్కు లాగుతారు. ఎంతోమంది మన నమ్మకాన్ని చూసి గేలి చేస్తారు. మన మాటలనూ, ప్రవర్తననూ, ఆలోచనలనూ అనుక్షణం చులకన చేయడమో, అలక్ష్యం చేయడమో చేస్తారు. అందులో కొంతమంది మనకు అత్యంత ఆప్తులు కావడం చేత మన మంచి కోసమే చెప్తూ ఉండవచ్చు.
అదే సమయంలో కృంగి పోకుండా, భయపడకుండా తగినంత పట్టుదల, కృషి, నమ్మకం, ఆత్మవిశ్వాసం, సమయ పాలన పాటిస్తూ సాగితే విజయం సాధించగలం.
అంతే గానీ, ప్రతి చిన్న అడ్డంకికీ తలొగ్గి, ప్రయత్నమే మానేస్తే, లక్ష్య సాధన మాట అటుంచి జీవితంలో ఎందుకూ పనికిరామనిపించే స్థాయికి దిగజారిపోతాం. మన మీద మనమే నమ్మకం కోల్పోతాం.
ముఖ్యంగా నమ్మకం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అలుపెరగక పనిచేయడం అవసరం. జీవితంలో గెలుపుకు అడ్డదారి లేదు. అడ్డదారిలో, తక్కువ సమయంలో సాధించే విజయం ఎక్కువకాలం నిలబడదు. మొక్క కూడా ఏపుగా పెరిగి నిలబడాలంటే నేలలో బలంగా వేళ్ళూనుకోవాలి. అదే విధంగా అనుకున్న గెలుపు సాధించడానికి తగినంత సమయం పడుతుంది. ఆఖరి క్షణంలో ఓర్పును విడిచిపెట్టకూడదు.
గెలుపు తథ్యం…..
నమ్మకం ముఖ్యం….
Good one andi