Learn to adjust when its tough to manage
పక్కింటి సుధాకర్ వాళ్ళూ కూడా నిన్నే వెళ్ళి కావలసిన సరుకులన్నీ తెచ్చేసుకున్నారు. మీరేమో మమ్మల్ని బయటికి కదలద్దని వార్నింగిచ్చి ఇంట్లో కూర్చోమన్నారు. ఎలా గడపాలి? ఏం వండి పెట్టాలి? ఎదిగిన పిల్లలు, వయసు పైబడిన పెద్దవాళ్ళు ఇంట్లో. అంటూ విసుక్కుంటున్న చంచల కంగారుకీ అమాయకత్వానికి నవ్వుకున్నాడు ఫోన్లోంచి వీడియో కాల్ లో చూస్తూ పార్థు (ఆమె భర్త). అత్యవసర సేవా విభాగాల్లో పనిచేస్తున్న పార్ధు ఇంటికి దూరంగా ఉద్యోగం వలన వారానికొకసారి సెలవు రోజున తప్ప ఇంటికి […]
Read More
Critical Thinking
“హమ్మయ్య… లాక్డౌన్ లో రెండ్రోజులు గడిచిపోయాయి (21 రోజులు ప్రకటనలో ఒక్కరోజే అనుకోండి). ఫర్వాలేదనిపిస్తోంది నిన్నటి అప్డేట్స్ చూస్తే. కరోనా బారిన పడ్డవారి సంఖ్యను అదుపులోకి తేగలరనే అనిపిస్తొంది ఈ లాక్డౌన్ పద్ధతి వలన. జనానికి బాధ్యత ఉండాలి. ప్రమాదమని చెప్పినా, బయటికెళ్ళొద్దని వారించినా అడపా దడపా ఎవరో ఒక ఆకతాయి రోడ్డుమీద కనిపిస్తూనే ఉన్నారు. నిన్న అత్యవసరంగా సరుకులు తేవడానికని మన పక్కవీధిలో కిరాణా షాపుకెడితే అక్కడ నలుగురైదుగురు కుర్రాళ్ళు కొనడానికి వచ్చి ఉన్నారు. పాపం రూముల్లోనో […]
Read More
Thanks to the Journalists
పేపర్ చదువుతున్న ప్రతిసారీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి కావ్య. అసలు మన చుట్టూ ఏం జరుగుతోందనే విషయానికి అద్దం పట్టేదే న్యూస్ పేపర్. జనానికి ఒకరినొకరు తాకడం ద్వారా వివిధ మాధ్యమాల్లో వ్యాపించే ఈ వ్యాధిని అరికట్టడం కోసం ప్రభుత్వం వారు తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఈ లాక్డౌన్. అందులో పేపర్ సర్క్యులేషన్ కూడా ఉంది. అయినా పాత్రికేయులు వారి పని మానకూడదు. ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా ప్రజలకు వార్తలు అందించడమే ఒక పత్రికా విలేఖరిగా […]
Read More
Story behind the closed doors
క్వారంటైన్… అనుకుంటుండగానే ఆమెకి ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. సరే ఇప్పుడే వెళ్లి తెచ్చుకొచ్చేస్తే మంచిది అని బయల్దేరబోయింది. ఇంతలో పాప నిద్ర లేచి ఏడవడం మొదలు పెట్టింది. అయ్యో, ఇప్పుడు బయటికి వెళ్తే పాపని ఎవరూ చూసుకోవడానికి లేరు. సర్లే రేపు చూద్దాం. అంటూ, అయ్యో నా తల్లే, దా అమ్మా…. అంటూ పాపని ఒళ్ళోకి తీసుకుని జోకొట్టడం మొదలు పెట్టింది. నెమ్మదిగా పాప ఎడుపు ఆపి తల్లి ఒడిలో నిద్రకి ఒరిగింది. నెమ్మదిగా ఒడిలోంచి […]
Read More
Empathy
“ఏది ఏమైనా పెద్దాయన చేసినది తప్పే ఒదినా. ఎందుకు ఇలాంటి సమయంలో ఇంట్లోంచి బయటికెళ్ళాలి? అసలు ప్రమాదం వయసు పైబడినవారికేనంటూ పదే పదే ప్రకటనలు వింటూనే ఉన్నాంగా. నీకూ నాకూ తెలిసినప్పుడు, అంత వయసున్న ఆయనకి తెలియదంటే ఏం చెప్పాలి. ఇది కేవలం నిర్లక్ష్యం, మొండితనం తప్ప మరేదీ కాదు”, అంటూ ఆవేశంగా తన ఒదినగారితో బాహాటంగానే ఫోన్ లో మాట్లాడుతోంది సంజన. ఇంతలో తన మాటలు వింటూ భర్త వివేక్ బయటికి రావడంతో సంభాషణకు బ్రేక్ […]
Read More