Thanks to the Journalists
పేపర్ చదువుతున్న ప్రతిసారీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి కావ్య. అసలు మన చుట్టూ ఏం జరుగుతోందనే విషయానికి అద్దం పట్టేదే న్యూస్ పేపర్. జనానికి ఒకరినొకరు తాకడం ద్వారా వివిధ మాధ్యమాల్లో వ్యాపించే ఈ వ్యాధిని అరికట్టడం కోసం ప్రభుత్వం వారు తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఈ లాక్డౌన్. అందులో పేపర్ సర్క్యులేషన్ కూడా ఉంది. అయినా పాత్రికేయులు వారి పని మానకూడదు. ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా ప్రజలకు వార్తలు అందించడమే ఒక పత్రికా విలేఖరిగా […]
Read More
Story behind the closed doors
క్వారంటైన్… అనుకుంటుండగానే ఆమెకి ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. సరే ఇప్పుడే వెళ్లి తెచ్చుకొచ్చేస్తే మంచిది అని బయల్దేరబోయింది. ఇంతలో పాప నిద్ర లేచి ఏడవడం మొదలు పెట్టింది. అయ్యో, ఇప్పుడు బయటికి వెళ్తే పాపని ఎవరూ చూసుకోవడానికి లేరు. సర్లే రేపు చూద్దాం. అంటూ, అయ్యో నా తల్లే, దా అమ్మా…. అంటూ పాపని ఒళ్ళోకి తీసుకుని జోకొట్టడం మొదలు పెట్టింది. నెమ్మదిగా పాప ఎడుపు ఆపి తల్లి ఒడిలో నిద్రకి ఒరిగింది. నెమ్మదిగా ఒడిలోంచి […]
Read More
Empathy
“ఏది ఏమైనా పెద్దాయన చేసినది తప్పే ఒదినా. ఎందుకు ఇలాంటి సమయంలో ఇంట్లోంచి బయటికెళ్ళాలి? అసలు ప్రమాదం వయసు పైబడినవారికేనంటూ పదే పదే ప్రకటనలు వింటూనే ఉన్నాంగా. నీకూ నాకూ తెలిసినప్పుడు, అంత వయసున్న ఆయనకి తెలియదంటే ఏం చెప్పాలి. ఇది కేవలం నిర్లక్ష్యం, మొండితనం తప్ప మరేదీ కాదు”, అంటూ ఆవేశంగా తన ఒదినగారితో బాహాటంగానే ఫోన్ లో మాట్లాడుతోంది సంజన. ఇంతలో తన మాటలు వింటూ భర్త వివేక్ బయటికి రావడంతో సంభాషణకు బ్రేక్ […]
Read More
Trust-Friendship
“ఇంకొక్క రెండ్రోరోజుల్లో ఈ లెక్కలన్నీ అప్పజెప్పేసి విడిగా పోతాను. ఆ పాటిదానికి వీడితో గొడవెందుకు. కాస్త ఓపిక పడితే అయిపోయేదానికి” అని ఆలోచించి నోటి చివరిదాకా వచ్చిన పరుషవాక్యాన్ని దిగమింగి అక్కడినుంచి లేచితన గదిలోకెళ్ళిపోయాడు నరేష్. అతడు, అతడి ప్రాణస్నేహాతుడు దేవా. వాళ్ళు చిన్నప్పటినుంచిస్నేహితులు. దేవా బాగా డబ్బున్న వారబ్బాయి కావడం వలన కొంత నోటి దురుసు ఉన్నప్పటికీ నరేష్ అంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. నరేష్ మధ్య తరగతి కుటుంబం నుంచి రావడం చేత సర్దుకుపోవడం […]
Read More
First Step – Toli Adugu
శరత్ చంద్ర ఈమధ్యే ట్రాన్స్ఫర్ మీద ఒక కొత్త ఊర్లో ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నాడు. ఇన్స్పెక్టర్ అంటే పోలీస్ అనుకునేరు, హెల్త్ ఇన్స్పెక్టర్ అండి. స్వతహాగా మంచి వ్యక్తి, పైగా సేవా తత్వం ఉన్నవాడు. ఎన్నో ఏళ్ళుగా అదే ఉద్యోగంలో ఉన్నమీదట, డాక్టరు కోర్సు చదవకపోయినా అనుభవం మాత్రం అంతకంటే ఎక్కువే. అందువల్ల చుట్టుపక్కల ఎటువంటి చిన్న చితక వైద్య సంబంధిత సహాయానికైనా అర్ధరాత్రి అపరాత్రి అనే భేదం లేకుండా ఉన్నపళంగా వెళ్ళి అక్కడ అన్నీ […]
Read More
Get Ready to Win
చేసే పని ఏదైనా ఎంత చిన్నదైనా నమ్మకంతో చేయడం అవసరం ఎన్నిసార్లు గెలుపోటములు చూశామని కాదు ఎన్నిసార్లు ప్రయత్నించామన్నది ముఖ్యం ప్రతి ప్రయత్నంలోనూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటాము ప్రతి ఓటమిలోనూ ఎంతో కొంత అనుభవం గ్రహిస్తాము తిరిగి మరలా చేసే ప్రయత్నంలో కొత్తపాఠాలను, పాత అనుభవాలను క్రోడీకరించి వ్యూహరచన చేయడం అవసరం ఉత్సాహం, ఆశ, నమ్మకం, పట్టుదల, ప్రయత్నం, తపన ఇలా ఎన్నో విషయాల మేలు కలయిక జీవితంలో విజయం ఉఛ్వాశ నిశ్వాసాలు గమనించాలి – […]
Read More
Share your Responsibilities
బాధ్యతను పంచుకో … అబ్బబ్బ ఈ కరోనా కాదు గానీ సరదా తీరిపోతోంది. ఓ పనిమనిషి రాదు, వేరే సాయమూ లేదు. అన్నీ ఒంటిచేత్తో చేసుకోలేక ప్రాణాలు పోతున్నాయి… అని తిట్టుకుంటూ ఒక్కొక్క పని చేసుకుంటోంది రాణి. రోజూ ఉదయాన్నే ఫ్రెష్ గా భార్యా భర్తలిద్దరు కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగే అలవాటు. ఇంటి పనులు పనమ్మాయి చేస్తుంది కాబట్టి అంత అలసట ఉండదు. రోజు కాస్త బద్ధకంగా మొదలై ఆఫీస్ కి వెళ్ళే […]
Read More
Coffee with Lavanya..
కాఫీ కలుపుకుందామని స్టవ్ మీద పాలు పెట్టిన వెంటనే ఒక విషయం గుర్తొచ్చి వెంటనే ఇలా వచ్చానండీ…“అన్నట్టు ఈరోజు ఫేస్బుక్ చూసారా, వనజ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు, మర్చిపోకుండా విష్ చేసెయ్యండి” అంటూ గుర్తుచేసుకునే రోజులోచ్చేసేయ్… సొంత చుట్టాలవి గాని, తోడబుట్టిన వారివి గాని ఎటువంటి విషయాలైనా గుర్తు రావు… ఇక్కడ చూస్తె తప్ప… సరే ఇంతకీ ఉపోద్ఘాతం ఎందుకా అనుకుంటున్నారా? ఉదయాన్నే నిద్రలేస్తూనే టైం చూడడానికి కాకుండా మన ఆడవారికి ఏ గేడ్జేట్ వైపూ తొంగి […]
Read More
తస్మాత్ జాగ్రత్త!!
ఎధావిధిగా ఉదయాన్నే డిజిటల్ న్యూస్ పేపర్ లో కరెంట్ స్టేటస్ చూస్తున్న సూర్యకి “ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు” అంటూ ముద్దు ముద్దుగా పలుకుతున్న తన కొడుకు సహజ్ మాటలు వినిపించాయి. వాడికి రెండున్నరేళ్ళు. ఆశ్చర్యపోతూ, ఒరేయ్ పండూ, ఎంత బాగా చెప్తున్నావో. ఏదీ మరోసారి చెప్పు అంటూ దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడబోయాడు. “ఉండు నాన్నా, కరోనా వస్తుంది. మీటర్ దూరంగా ఉండి మాట్లాడు” అంటూ చురచురా బుగ్గ తుడిచేసుకుంటూ దూరంగా వెళ్ళి […]
Read More
కలా నిజమా…!!
సాయంత్రం అయ్యింది… వేసవికాలం ఎండ వేడి తగ్గి చల్లగాలేస్తోంది… రవళి ఇంకా ఆలోచిస్తూనే ఉంది… తల్చుకునే కొద్దీ ముచ్చెమటలు పోసేస్తున్నాయి. ఇంతకీ తను చూసింది నిజమేనా? నమ్మలేకపోతోంది. ఇంతలో మూడేళ్ళ కూతురు కనిష్క పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్ళకి చుట్టుకుంది… దాన్ని చూసినా భయమేస్తోంది… పాప పిలుస్తూనే ఉంది గానీ తను ఈ లోకం లోకి రాలేకపోతోంది ఆ షాక్ లోంచి ఇంకా తేరుకోలేదు ఇంతలో పాప పక్క గదిలోంచి అరుస్తూ ఆడుతూ నవ్వుతూ పిలుస్తోంది… అమ్మా, రా […]
Read More
కొత్తిల్లు!!
సరోజ వాళ్ళు కొత్తింట్లో దిగారు ఈమధ్యే… ఇల్లు చాలా విశాలంగా ఉంది. ముందు వెనక చక్కగా బోలెడంత స్థలం.. పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది ఉండదు అనుకుంది చూసిన వెంటనే. అందుకే ఆమె భర్త ఆ ఇంటికి ఎడ్వాన్స్ ఇచ్చేస్తా అంటే ఎంతో సంబరపడిపోయింది.ఇంట్లోకి దిగాకా సర్దుకోవడాలు మామూలే… ఆయనా ఓ రెండ్రోజులు సెలవు పెట్టాడు, పిల్లలూ సాయానికి ఉన్నారు.. సెటిల్ అయ్యాం అనుకున్నాకా, తన పనులు రెగ్యులర్గా చేసుకోవడం మొదలు పెట్టింది.పిల్లలు స్కూల్ కి, భర్త ఆఫీస్ […]
Read More
అమ్మాయి ఇంకా రాలేదు…
పరుగుపరుగున వచ్చి తనలేత చేతులతో తనని చుట్టుకుపోయిన కూతుర్ని చూసి మనసు ఉప్పొంగిపోయింది స్రవంతికి. “ఏమ్మా! స్కూల్ అయిపోయిందా. కొత్త స్కూల్ నచ్చిందా” అంటూ దగ్గరకి తీసుకుని తన ఆరేళ్ళ కూతురు సాహితిని ముద్దాడుతూ గారంగా అడిగింది స్రవంతి. “బావుందమ్మా స్కూలు, అందరూ చక్కగా ఆడుకున్నాం. మా టీచరు బోలెడు కథలు కూడా చెప్పేరు తెలుసా” అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న కూతురిని బండి మీద ఎక్కించుకుని ఇంటివైపు ప్రయాణమైంది స్రవంతి.స్రవంతి భర్త చనిపోయి ఏడాది అవుతోంది. […]
Read More
శారదాస్ డైరీ…. !
కొన్ని జ్ఞాపకాల చిన్ముద్రలు మస్తిష్కంపై కనీసం నామమాత్రంగా కూడా కనపడవు. మరి కొన్ని శిలా ఫలకం మీద చెక్కినట్టు లోతైన ముద్రలు వేసుకుని ఉండిపోతాయి. మీరెప్పుడైనా గమనించారా? ఈరోజు సముద్రం ఒడ్డున ఇసుక తెన్నెల్లో పిల్లలు హాయిగా ఆడుకోవడం చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు నా పుట్టిన రోజు. నేను మా వారు కలిసి చాలా కాలం తర్వాత ఇంట్లోంచి బయటికి కలిసి వచ్చేము. దాదాపు నాలుగేళ్ళ తర్వాత. నా పేరు శారద, మా వారు […]
Read More
ప్రియమైన నీకు…
ఈ ఉత్తరం నీకందే సమయానికి నేను నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. నువ్వు నన్ను కలవడానికి వచ్చేముందు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని స్పష్టంగా నీకు చెప్పదల్చుకున్నాను. చదివిన తరువాత రాకపోయినా, నీమీద నాకున్న అభిప్రాయం గానీ, గౌరవం గానీ ఏ మాత్రం మారదు. నిర్ణయం ఎప్పుడూ నీదే. నేను గతేడాది మార్చి పదకొండున నా స్నేహితురాలిని కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో, దారిలో ఒకతను రోడ్డుకు ఒక ప్రక్కగా పడి ఉండడం గమనించాను. అప్పటికే కాస్త […]
Read More